పోలవరం ప్రాజెక్టు పనులకు రూ. 4,900 కోట్లకు రివర్స్ టెండర్లను పిలిచిన ఏపీ ప్రభుత్వం

  • హెడ్ వర్క్ పనులకు రూ. 1800 కోట్లు
  • హైడల్ ప్రాజెక్టుకు రూ. 3,100 కోట్లు
  • 2015-16 ఎస్ఎస్ఆర్ రేట్లతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ
పోలవరం ప్రాజెక్టు పనులకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం రూ. 4,900 కోట్లతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభంచింది. ఇందులో హెడ్ వర్క్ పనులకు రూ. 1,800 కోట్లు, హైడల్ ప్రాజెక్టు పనులకు రూ. 3,100 కోట్ల అంచనాలతో టెండర్ల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 2015-16 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించింది. గతంలో అంచనాలను భారీగా పెంచారని ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు, రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దంటూ కేంద్ర జల వనరుల శాఖ చేసిన సూచనలను సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది.
Go Back to Shorts
Polavaram
Reverse Tendering
Andhra Pradesh

More Telugu News